![]() |
![]() |
ఆహా ఓటిటి వేదిక మీద ఓంకార్ నిర్వహిస్తున్న డాన్స్ ఐకాన్ సీజన్ 2 మంచి డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో అద్భుతమైన కంటెస్టెంట్స్ తో దూసుకుపోతోంది. ఇక ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ మెంటార్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆమె కంటెస్టెంట్ గా కాంచి షా అనే డాన్సర్ వచ్చింది. ఇక ఆ అమ్మాయి గురించి చెప్పుకోవాలంటే 20 సంవత్సరాల వయసులో ముంబై లో డాన్సర్ గా ఒక ఊపు ఊపేసింది. అలాగే ఈమె ఫిట్నెస్ ట్రైనర్ గా తన జర్నీ కంటిన్యూ చేస్తోంది. చిన్న వయసు నుంచి ఆమెకు డాన్స్ అంటే ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను పూర్తిస్థాయి డాన్సర్ గా , కొరియోగ్రాఫర్ గా, ఫిట్‌నెస్ గురువుగా ఎదిగేలా చేసింది.. ఆమె బ్యాలె, జాజ్, హిప్ హాప్, బాలీవుడ్, బెల్లీ డ్యాన్స్ , ఇంకా లేటెస్ట్ ట్రెండింగ్ డాన్స్ స్టైల్స్ చేస్తుంది. ఈమె తండ్రి హేమంత్ షా ఒక బిజినెస్ మ్యాన్, తల్లి చేతనా షా హౌస్ వైఫ్ గా ఉంటారు. రోబోటిక్ డాన్స్ స్టైల్ కి ఆమె పెట్టింది పేరు. కాంచీ షా 2016లో జీ ఎంటర్టైన్మెంట్ డాన్స్ షో సిరీస్ "సో యు థింక్ యు కెన్ డ్యాన్స్" ద్వారా బుల్లితెరపైకి అరంగేట్రం చేసింది. ఆమె ఆ షోలో టాప్ 10 గా నిలిచింది.. తరువాత, 2019లో, కాంచి షా ఇండియన్ డ్యాన్స్డ్ రియాలిటీ టెలివిజన్ సిరీస్ "డాన్స్ దీవానే" సీజన్ 2 షోస్ లో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకుంది. 2021లో, కాంచి షా సోనీ ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్ రియాలిటీ షో అయిన "ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ " లో పార్టిటిసిపేట్ చేసింది. మలైకా అరోరా, గీతా కపూర్ , టెరెన్స్ లూయిస్ వంటి వాళ్ళు ఆమె డాన్స్ స్టైల్ కి మెస్మోరైజ్ అయి టాప్ 12 కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఎంపిక చేశారు. ఈమె యూట్యూబ్ కంటెంట్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆమె తన డాన్స్ వీడియోస్ ని "కాంచి షా యానిమేషన్ డాల్" అనే తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేస్తుంది. కాంచి షా కొరియోగ్రాఫర్ గా ఎంతో మంది స్టూడెంట్స్ కి డిఫెరెంట్ డాన్స్ స్టైల్స్ ని నేర్పిస్తూ ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక ఈమె ఇప్పుడు తెలుగు డాన్స్ ఐకాన్ సీజన్ 2 కి వైల్డ్ కార్డు ఎంట్రీ కంటెస్టెంట్ గా వచ్చేసింది.
![]() |
![]() |